హైవే పనులను అడ్డుకున్న రైతులు

హైవే పనులను అడ్డుకున్న రైతులు

కరీంనగర్​ రూరల్, వెలుగు: కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల గ్రామంలో జరుగుతున్న నేషనల్‌‌‌‌ హైవే పనులను రైతులు బుధవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జగిత్యాల–వరంగల్‌‌‌‌ హైవే నిర్మాణంలో తాము భూములు కోల్పోతున్నామని వాటికి సరైన నష్టపరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలని డిమాండ్​ చేశారు. ఆందోళన సమాచారం తెలుసుకున్న సంబంధిత ఆఫీసర్లు రైతులతో మాట్లాడి రెండుమూడు రోజుల్లో డబ్బులు అకౌంట్లలో జమచేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.