రైతుల పోరాటానికి నేటితో ఏడాది

రైతుల పోరాటానికి నేటితో ఏడాది

కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను నిరసిస్తూ రైతులు చేసిన పోరాటానికి నేటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా వాఘా బోర్డర్ వద్ద రైతులు సమావేశమయ్యారు. ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా.. ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలని వాఘా బోర్డర్ వద్ద ఆందోళనకు దిగారు. వివాదాస్పద సాగుచట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు గత వారం ప్రధాని మోడీ ప్రకటించారు. కేంద్ర ప్రకటనను స్వాగతిస్తున్నామని.. రైతు డిమాండ్లను కూడా పరిష్కరించాలని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు కోరుతున్నారు. ఢిల్లీలో జరిగబోయే భారీ బహిరంగ సభకు రైతులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతేడాది నవంబర్ 26న ఢిల్లీని ముట్టడించిన రైతులు, సాగుచట్టాలను రద్దు చేయాలని నినదించారు. అలాగే విద్యుత్తు బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది కాలంలో నిరసనలు తెలియజేస్తూ చనిపోయిన రైతులకు నివాలర్పించారు. కాగా.. నేటి రైతుల ఆందోళనలతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.