ధరణి సమస్యలపై సీసీఎల్ఏ ముందు రైతుల ఆందోళన

ధరణి సమస్యలపై సీసీఎల్ఏ ముందు  రైతుల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా  నారాయణపురం  రెవెన్యూ  గ్రామ పరిధిలోని  ధరణి సమస్యలపై  హైదరాబాద్ అబిడ్స్  సీసీఎల్ఏ  ఆఫీస్ ముందు  రైతులు ఆందోళన  చేశారు. రెవెన్యూ  అధికారుల నిర్లక్ష్యంతో నాలుగేళ్లుగా  రైతుబంధు, రైతుబీమా , పీఎం కిసాన్ వంటివి  అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటి వరకు 12 కోట్ల  రూపాయల దాకా  నష్టపోయామని  రైతులు చెప్పారు.  అటవీశాఖ  అధికారులు పట్టా భూములు  అని  క్లియరెన్స్ ఇచ్చినా  ధరణిలో ఆప్షన్ లేదంటూ రెవెన్యూ అధికారులు..  నమోదు చేయడం లేదని రైతులు తెలిపారు.