యూరియా గోస.. రంగారెడ్డి జిల్లా యాచారంలో చెప్పులతో క్యూ

యూరియా గోస.. రంగారెడ్డి జిల్లా యాచారంలో చెప్పులతో క్యూ
  • తక్కువ బస్తాలు రావడంతో ఎగబడిన రైతులు

ఇబ్రహీంపట్నం, వెలుగు: యూరియా కొరత రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో కొన్ని రోజులుగా రైతులు యూరియా కోసం  పీఏసీఎస్  సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఒక్క బస్తా కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. బుధవారం ఉదయమే యాచారం పీఏసీఎస్  గోదాం వద్దకు వందల సంఖ్యలో రైతులు చేరుకున్నారు. 

అక్కడ చెప్పులను క్యూలో పెట్టి యురియా కోసం వేచి చూశారు. సరిపడా యురియా రాకపోవడంతో ఎలాగైనా బస్తా తీసుకోవాలన్న తాపత్రాయంతో రైతులు ఎగబడ్డారు. ఉన్న స్టాక్​ను పోలీసుల పహారా నడుమ పంపిణీ చేశారు. యురియా అందని రైతులకు టోకెన్లు ఇచ్చారు. వారికి మరో లోడ్​ రాగానే ఇస్తామని పీఏసీఎస్​ నిర్వాహకులు తెలిపారు.