రైతుల ఆదాయంపై ఎస్బీఐ రిపోర్టులో ఏముందంటే...

 రైతుల ఆదాయంపై ఎస్బీఐ రిపోర్టులో ఏముందంటే...

ముంబై: 2018–2022 మధ్య కాలంలో దేశంలోని రైతుల ఆదాయం 1.3 నుంచి 1.7  రెట్లు దాకా పెరిగినట్లు ఎస్​బీఐ రీసెర్చ్​ రిపోర్టు వెల్లడించింది. మహారాష్ట్రలోని సోయాబీన్​ రైతులు, కర్నాటకలోని పత్తి రైతుల ఆదాయమైతే ఏకంగా రెట్టింపైనట్లు పేర్కొంది. వాణిజ్య పంటలు​ పండించే రైతుల ఆదాయాలు బాగా పెరిగినట్లు ఎస్​బీఐ చీఫ్​ ఎకానమిస్ట్​ సౌమ్యకాంతి ఘోష్​ ఈ రిపోర్టులో చెప్పారు. దీంతో జీడీపీలో అగ్రికల్చర్​ వాటా గతంలోని 14.2 శాతం నుంచి 18.8 శాతానికి పెరిగిందన్నారు. కరోనా సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్​ వల్ల తయారీ, సర్వీస్​ సెక్టార్లు కొంత దెబ్బతిన్న విషయం తెలిసిందేనని పేర్కొన్నారు.

బ్లాక్​ పెప్పర్​, కార్డమమ్​, క్లోవ్​, సినమన్​, నేచురల్​ రబ్బర్​ వంటి వాటి ధరల తగ్గుదలపై ఈ రిపోర్టు ఏమీ మాట్లాడకపోవడం ఆసక్తికరమైన విషయం. రైతులకు ఫండ్స్​ లభ్యత కోసం రూ.5 లక్షల కోట్లతో క్రెడిట్​ గ్యారంటీ ఫండ్​ఏర్పాటు చేయాలని, కనీసం 10 లక్షల మందికి లైవ్లీహుడ్​ క్రెడిట్​ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వానికి ఈ రిపోర్టు సూచించింది. కరోనా మహమ్మారి టైములో దేశ ఎకానమీని ఒక రకంగా వ్యవసాయ రంగమే ఆదుకుందని రిపోర్టు వివరించింది. 2022లో అగ్రికల్చర్​ ఎక్స్​పోర్ట్స్​ 50 బిలియన్​ డాలర్లను దాటాయని పేర్కొంది. మినిమం సపోర్ట్​ ప్రైస్​ (ఎంఎస్​పీ) ను పెంచడం కూడా ఈ రంగం ఎదుగుదలకు సాయపడుతోందని ఎస్‌బీఐ రీసెర్చ్​ రిపోర్టు వివరించింది.