
-
రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ భూమి సునీల్
హాలియా, వెలుగు : భూ చట్టాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ భూమి సునీల్ సూచించారు. సాగు న్యాయ యాత్రలో భాగంగా లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిడమానూర్ రైతు వేదికలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటసాగులో నష్టపోయినా, పంటకు గిట్టుబాటు ధర రాని సమయంలో రైతులు న్యాయ సాగు చట్టాలను ఆశ్రయించవచ్చునని తెలిపారు. విత్తనాలు, పురుగులమందులు, ఎరువులు కొనుగోలు చేసి నష్టం జరిగినప్పుడు, చట్టాలను ఉపయోగించుకుంటే నష్టపరిహారాన్ని పొందే అవకాశం ఉందన్నారు.
చట్టంలో రైతుల కోసం ప్రత్యేకంగా 200 చట్టాలు ఉన్నాయని, వాటిపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం రైతులకు భూమి సమస్యలు, విత్తనం, సాగునీటి సమస్యలు, పంట రుణాలు, పంటల బీమా మార్కెట్ సంబంధిత సమస్యలు, సాగు చట్టాలపై అవగాహ కల్పించారు.
చట్టాలపై అవగాహన అవసరం..
మిర్యాలగూడ, వెలుగు : రెవెన్యూ చట్టాలపై రైతులకు అవగాహన అవసరమని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు ఎం.సునీల్ అన్నారు. సాగు న్యాయ యాత్రలో భాగంగా గురువారం మిర్యాలగూడ రైతు వేదికలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.