చర్చలకు మేం రెడీ: రైతులు

చర్చలకు మేం రెడీ: రైతులు

ఎప్పుడు రమ్మంటరు?

న్యూఢిల్లీ: అగ్రి చట్టాలపై మరో రౌండ్ చర్చలకు రెడీగా ఉన్నట్టు రైతు నాయకులు ప్రకటించారు. చర్చలకు తేదీని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాలని కోరారు. రైతులు ఉద్యమాన్ని ఆపి, మళ్లీ చర్చలకు రావాలన్న ప్రధాని మోడీ ఆహ్వానంపై రైతు నాయకులు స్పందించారు. అయితే దేశంలో కొత్త రకం ఆందోళనకారులు పుట్టుకొచ్చారంటూ చేసిన ప్రధాని మోడీ రాజ్యసభలో చేసిన కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనల పాత్ర కీలకమని తెలిపారు. ‘ప్రభుత్వంతో మరో రౌండ్ చర్చలకు రెడీ. డేట్ ఫిక్స్ చేసి.. మీటింగ్ టైమ్ చెప్పాలి. చర్చలకు మేము ఎప్పుడూ వెనుకాడలేదు. మమ్మల్ని పిలిచిన ప్రతిసారి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపాం’ అని సంయుక్త్ కిసాన్ మోర్చా సీనియర్ మెంబర్ శివకుమార్ కక్కా సోమవారం అన్నారు. అగ్రి చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు నాయకుల మధ్య  ఇప్పటి వరకు 11 రౌండ్ల చర్చలు జరిగాయి. అయితే చర్చలు కొలిక్కి రాలేదు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని, ఎంఎస్పీకి లీగల్ గ్యారంటీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు, ఏడాది నుంచి ఏడాదిన్నరపాటు చట్టాల అమలును నిలిపివేస్తామని కేంద్రం ఆఫర్ ఇచ్చినా.. రైతు నాయకులు నిరాకరించారు. ఎంఎస్పీ ఎక్కడికీ పోదని కేంద్రం చెబుతున్నప్పుడు, లీగల్ గ్యారంటీ ఎందుకు ఇవ్వడం లేదని మరో రైతు నాయకుడు అభిమన్యు కోహర్ ప్రశ్నించారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని తాము నమ్ముతున్నామని, అయితే తమ డిమాండ్లను పట్టించుకోకుండా కేంద్రం ఇష్యూను డైవర్ట్ చేయాలని చూస్తోందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఉగ్రహన్ పంజాబ్ జనరల్ సెక్రటరీ సుఖ్ దేవ్ సింగ్ ఆరోపించారు.

ఆకలిపై వ్యాపారాన్ని అడ్డుకుంటం: రాకేశ్ తికాయత్

ఆకలిపై వ్యాపారం చేయడాన్ని తాము అనుమతించబోమని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. ఆకలిపై వ్యాపారం చేసేవాళ్లను దేశం నుంచి తరిమేయాలన్నారు. కొత్త చట్టాలు అమలైతే కనీస మద్దతు ధరపై ఆందోళనలు తొలగిపోతాయని, రైతులు ఆందోళన వీడి చర్చలకు రావాలని రాజ్యసభలో ప్రధాని మోడీ మాట్లాడటంపై రాకేశ్ తికాయత్ స్పందించారు. కులం, మతం ఆధారంగా డివైడ్ చేయాలని ప్రయత్నించినా.. రైతులంతా యూనిటీగా ఉన్నామని చెప్పారు.

For More News..

ఉత్తరాఖండ్ జల ప్రళయానికి కారణమదేనా?

హైదరాబాద్‌లో ఎత్తైన అపార్ట్‌మెంట్.. పర్మిషన్ ఇచ్చిన అధికారులు

హఫీజ్‌‌‌‌పేట్‌‌‌‌ భూములు.. సర్కార్‌‌‌‌‌‌‌‌వి ఎట్లయితయ్‌‌‌‌?

ఏడాదిగా కోమాలో.. అయినా రెండుసార్లు కరోనా