మహారాష్ట్రలో మళ్లీ రైతుల పోరుబాట.. నాసిక్​ నుంచి ముంబైకి మార్చ్

మహారాష్ట్రలో మళ్లీ రైతుల పోరుబాట.. నాసిక్​ నుంచి ముంబైకి మార్చ్

ముంబై: మహారాష్ట్రలో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ సమస్యలు తొలగించాలని డిమాండ్​ చేస్తూ రైతులు, గిరిజనులు నాసిక్​ జిల్లాలోని దిన్దోరి టౌన్​ నుంచి మార్చ్ మొదలుపెట్టారు. ఈ భారీ ర్యాలీలో వేలాది మంది రైతులు, గిరిజనులు పాల్గొంటున్నారు. ఈ మార్చ్ బుధవారం థానే జిల్లాకు చేరుకుంది. ధర దారుణంగా పడిపోవడంతో ఉల్లి రైతులకు క్వింటాల్​కు రూ.600 తక్షణ సాయం, 12 గంటల పాటు కరెంట్​ సరఫరా, వ్యవసాయ రుణాల రద్దు.. తదితర డిమాండ్లతో సీపీఎం ఆధ్వర్యంలో ఈ మార్చ్ మొదలైంది.