వరి వైపే రైతుల మొగ్గు .. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పంట ప్రణాళికలు రెడీ

వరి వైపే రైతుల మొగ్గు .. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పంట ప్రణాళికలు రెడీ
  • కరీంనగర్​ జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో వరి, 50 వేల ఎకరాల్లో పత్తి సాగు అంచనా
  • రూ.500 బోనస్  ప్రకటనతో సన్న వడ్ల సాగు పెరిగే చాన్స్‌‌‌‌‌‌‌‌

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో వచ్చే వానాకాలంలో రైతన్నలు వరి సాగుకే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడంతో జిల్లాలో సన్నాల సాగు పెరగొచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,45,070 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా, ఇందులో అత్యధికంగా 2,74,500 ఎకరాల్లో రైతులు వరి సాగు అయ్యే అవకాశముంది. 

మరోవైపు ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్​ ప్రకటించడంతో.. సన్నాల సాగు పెరిగే చాన్స్​ ఉందని అధికారులు భావిస్తున్నారు.  మరోవైపు పత్తి 48 వేల ఎకరాలు, మొక్కజొన్న 4,500, కందులు 2 వేలు, మిర్చి వెయ్యి, పెసర 550, వేరుశనగ 200, ఇతర పంటలు 14,320 ఎకరాల్లో సాగవుతాయని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. 

పత్తి విత్తనాలు దొరకట్లే.. 

రైతులకు మార్కెట్ లో పత్తి విత్తనాలు దొరకడం లేదు. జిల్లాలో 48 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, రైతులకు 1.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉన్నాయి. షాపుల్లో రైతులకు కావాల్సిన కంపెనీల విత్తన ప్యాకెట్లు దొరకడం లేదు. వ్యాపారుల దగ్గర స్టాక్ ఉన్నప్పటికీ.. అవి దొరకట్లేదని, డబుల్ రేట్ పెడితే తెచ్చి ఇస్తామని రైతులకు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అవుతుండడంతో రైతులు కూడా అదును తప్పుతుందని వ్యాపారులు అడిగినంత ఇచ్చి విత్తనాలు తెచ్చుకుంటున్నారు. మార్కెట్ లో రూ.800కు అమ్మాల్సిన పత్తి విత్తనాలను రూ.1600కు అమ్ముతున్నారు. 

రాజన్న జిల్లాలో 2.35లక్షల ఎకరాలు.. 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో వానకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఈ వానాకాలం సాధారణానికి మించి పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.35లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. వీటిలో వరి 1.82లక్షల ఎకరాల్లో, 50 వేల ఎకరాల్లో పత్తి, మిగతావి కందులు, మొక్కజొన్న, పెసర్లు, ఇతర పంటలకు అవకాశముందని ఆఫీసర్లు చెబుతున్నారు. గతేడాది వరి 1.70ఎకరాల్లో సాగవగా, ఈసారి 1.82లక్షల ఎకరాలకు పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మొత్తం పంటలకు 20 వేల టన్నులు ఎరువులు అవసరముంటుందని, ఇప్పటికే జిల్లాలో 6వేల టన్నులు సిద్ధం చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. పత్తి సాగుకు 3లక్షల విత్తన ప్యాకెట్లు రెడీగా ఉన్నాయి. 

నకిలీ విత్తనాలతో జాగ్రత్తగా ఉండాలి

రైతులు నకిలీ విత్తనాలతో అప్రమత్తంగా ఉండాలి. లైసెన్స్ ఉన్న ట్రేడర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. అవసరమైతే అగ్రికల్చర్ ఆఫీసర్ల సలహాలు తీసుకోవాలి. ఇప్పటికే నకిలీ విత్తనాల అమ్మకాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వానాకాలం సీజన్ లో జిల్లాల్లో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం. 

భాస్కర్ రెడ్డి, డీఏవో , రాజన్నసిరిసిల్ల