కుంటాల, వెలుగు : లింబాకే గ్రామంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు లింబా కే పరిసర గ్రామాల రైతులు శుక్రవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు రమణారావు, వెంగల్ రావు, నరేశ్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
