మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. ఆదివారం గండీడ్ మండలం రెడ్డిపల్లి, హన్వాడలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
వడ్లను ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గండీడ్ మండలం వెన్న చేడ్ గ్రామంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌ను సందర్శించారు. వంట గదిని పరిశీలించి, శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ తీసుకోవాలని, చదువుతో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని తెలిపారు.
