బయటికొస్తాం.. ఫైట్ చేస్తాం… : ఫరూక్ అబ్ధుల్లా

బయటికొస్తాం.. ఫైట్ చేస్తాం… : ఫరూక్ అబ్ధుల్లా

ఒక పక్క కశ్మీర్ తగలబడిపోతుంటే  నా ఇష్టపూర్తిగా ఇంట్లో కూర్చోని ఏం చేస్తానని ప్రశ్నించారు నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫరూక్ అబ్దుల్లా.  తనని హౌస్ అరెస్ట్ చేసారని,  తన కొడుకు ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడని ఆయన అన్నారు.  మోడీ ప్రభుత్వం మా ఇద్దరినీ చంపాలని చూస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేయడంపై మండిపడుతూ.. తమ ప్రమేయం లేకుండా ఆర్టికల్ ని రద్దు చేశారని, ఈ విషయంపై కోర్టుకెళతామని అన్నారు. ఒక్కసారి డోర్లు తెరుచుకుంటే కశ్మీర్ ప్రజలంతా బయటికొచ్చి, యుద్ధం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తామేమీ తుపాకీలతో బెదిరించే వాళ్లం కాదని, గ్రెనేడ్లు, రాళ్లు విసిరే వాళ్లం కాదని అన్నారు. తాము శాంతియుత పరిష్కారాన్ని కోరుతున్నట్లు ఫరూక్ తెలిపారు.

లోక్ సభలో హోంమంత్రి అమిత్ షా కామెంట్ ను తప్పుపట్టారు ఫరూక్ అబ్దుల్లా. “నాకు నేనుగా ఇంట్లో ఉన్నాననీ… నన్నెవరూ హౌజ్ అరెస్ట్ చేయలేదని అమిత్ షా లోక్ సభలో చెప్పారు. అది శుద్ధ అబద్ధం” అని చెప్పారు ఫరూక్ అబ్దుల్లా.