ఈ కారు.. ఎఫ్ 16 కన్నా ఫాస్ట్

ఈ కారు.. ఎఫ్ 16 కన్నా ఫాస్ట్

అమెరికా ఎఫ్ 16 యుద్ధ విమానం తెలుసా? దాని స్పీడు గంటకు 2 వేల కిలోమీటర్లపైమాటే. ఇదిగో ఈ కారు.. ఎఫ్ 16ను మించినదంట! అబ్బ కారుకు అంత సీనుందా? అని అంటారా! నిజమే ఆ కారుకు అంత సీన్ లేదు. కానీ, స్పీడ్ పికప్ లో మాత్రం ఎఫ్ 16ను తలదన్నేదేనని చెబుతున్నారు దాని తయారీదారులు.ఈ కారు 12 క్షణాల్లోనే 290 కిలోమీటర్ల వేగాన్ని అందుకుం టుందట. అది ఎఫ్ 16 యుద్ధ విమానం కన్నా వేగమట. అందుకే దాన్ని మించిన కారు అంటున్నారు. జస్ట్ కళ్లు మూసి తెరిచేలోగా వంద స్పీడుతో దూసుకెళుతుంది. అంటే 2 సెకన్లలోనే ఆ స్పీడును అందుకుంటుందన్నమాట. మ్యాగ్జిమమ్ స్పీడ్ గంటకు 350 కిలోమీటర్లం తే. అంటే ఎఫ్ 16కు ఎక్కడా పోటీ కానేకాదు. ఇంకో విషయమేంటంటే.. ఇది ఎలక్ట్రిక్ కారు. 120 కిలోవాట్ల బ్యాటరీతో నడుస్తుంది. ఒక్కసారి చార్జ్​చేస్తే 450 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లిపోద్ది. 40 నిమిషాల్లోపే 80 శాతం బ్యాటరీ ఫుల్ అయిపోద్ది. ఇంజన్ సామర్థ్యం 1900 హార్స్ పవర్ . దీని ధర సుమారు రూ.18.04 కోట్లు (20 లక్షల పౌండ్లు ). 2020 నుం చి అమ్మకాలు మొదలుపెడతారు. అన్నట్టు కారు పేరు చెప్పనేలేదు. ద పినిన్ ఫెరినా. దీని ఓనర్ ఇటలీ కంపెనీ అయిన బటిస్టా. ఇంకో విషయం జస్ట్ 150 కార్లను మాత్రమే కంపెనీ అమ్ముతుందట. న్యూయార్క్​ ఇంటర్నేషనల్ ఆటో షోలో ఈ కారును ప్రదర్శించారు. గత నెల్లోనే దీని ప్రొటోటైప్ ను తయారు చేశారు.