
పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF). పాకిస్తాన్ నుంచి పనిచేస్తూ.. ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలా చేయని పక్షంలో పాకిస్తాన్ ను బ్లాక్ లిస్ట్ లో పెడతామని FATF హెచ్చరించింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ ను కాపాడుందకు చైనా ప్రయత్నించినా… FATF ఇచ్చిన వార్నింగ్ గురించి మాత్రం ఆ దేశం ఏమీ మాట్లాడలేదు. పాకిస్తాన్ ను ఇప్పటికే గ్రే లిస్ట్ లో పెట్టింది FATF.
FATF యాక్షన్ ప్లాన్ ను పాకిస్తాన్ అమలు చేస్తుందని ఆశిస్తున్నామంది భారత్. ఈ ఏడాది సెప్టెంబర్ లోపు నిర్దిష్ట సమయంలోగా యాక్షన్ ప్లాన్ ను పూర్తిస్థాయిలో అమలు జరుగుతుందని తాము భావిస్తున్నట్టు తెలిపింది.