
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం బుచ్చిగూడ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి, కూతురు చనిపోయారు. బాత్కు చెన్నయ్య, అతని కూతురు సంగీత బుచ్చిగూడ నుంచి షాద్ నగర్ కు బైక్ పై వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఒక కారు వీరి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో చెన్నయ్య, సంగీత అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.