తండ్రి హింసిస్తున్నాడని..హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌కు బాలిక ఫిర్యాదు

తండ్రి హింసిస్తున్నాడని..హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌కు బాలిక ఫిర్యాదు
  • కూతురిని కాలితో తంతూ అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తి
  • కేసు నమోదు చేసిన  పోలీసులు

బూర్గంపహాడ్, వెలుగు : కాలితో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించడంతో పాటు వేధిస్తూ భయభ్రాంతులకు గురిచేసిన తండ్రిపై ఓ చిన్నారి చైల్డ్‌‌‌‌ హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌కు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్‌‌‌‌ మండలంలోని సారపాక ఐటీసీలో పనిచేస్తున్న రమేశ్‌‌‌‌.. నాలుగో తరగతి చదువుతున్న తన కూతురిని మంగళవారం కాలితో తంతూ అమానుషంగా ప్రవర్తించాడు. 

దీంతో భరించలేకపోయిన బాలిక 1098 చైల్డ్‌‌‌‌ హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌కు ఫిర్యాదు చేసింది. స్పందించిన ఆఫీసర్లు బూర్గంపహాడ్‌‌‌‌ ఐసీడీఎస్‌‌‌‌ సూపర్‌‌‌‌వైజర్‌‌‌‌ సక్కుబాయికి సమాచారం ఇవ్వగా.. ఆమె విచారణ చేసి రమేశ్‌‌‌‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సక్కుబాయి ఫిర్యాదుతో రమేశ్‌‌‌‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మేడ ప్రసాద్‌‌‌‌ తెలిపారు.