కొడుకు పుట్టాలని కూతురును బలిచ్చిన తండ్రి

కొడుకు పుట్టాలని కూతురును బలిచ్చిన తండ్రి

మనిషి చంద్రుని మీద కాలుపెట్టడమే కాకుండా.. అక్కడ ఉండటానికి కూడా సిద్ధపడుతున్న ఈ కాలంలో ఇంకా కొంతమంది మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఆ మూఢనమ్మకాల మీద విశ్వాసంతో జంతు బలులు, నర బలులు చేస్తున్నారు. తాజాగా అటువంటి నరబలి ఘటనే జార్ఖండ్‌లో జరిగింది. అయితే ఇక్కడ బలి ఇచ్చింది ఎవరో తెలియని వ్యక్తిని కాదు. సొంత కూతురిని సొంత తండ్రే బలిచ్చాడు. ఈ దారుణ ఘటన రాంచీ సమీపంలోని లోహర్దగాలోని పెష్రార్‌లో జరిగింది.

స్థానికంగా నివసించే సమన్ నెగాసియా అనే 26 ఏళ్ల వ్యక్తి కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. అయితే సుమన్‌కి ఎప్పటినుంచో కొడుకు పుట్టాలనే కోరిక ఉంది. అందుకోసం సుమన్ అప్పుడప్పుడు బాబాలను, చేతబడి చేసేవాళ్లను కలుస్తుండేవాడు. సుమన్ కోరిక విన్న చేతబడి చేసే వ్యక్తి.. నీకు కొడుకు పుట్టాలంటే నీ కూతరును బలి ఇవ్వాలని చెప్పాడు. దాంతో సుమన్ తన ఆరేళ్ల కుమార్తెను గొంతు కోసి చంపాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో సుమన్ భార్య తల్లిగారింట్లో ఉంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు సుమన్ అరెస్ట్ చేసి, క్షుద్రపూజలు చేసే వ్యక్తి కోసం గాలిస్తున్నారు. స్థానిక ఆస్పత్రిలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

For More News..

అయిదేళ్ల కింద పెళ్లి.. నాలుగేళ్ల కొడుకు.. అయినా అక్రమసంబంధాన్ని వదులుకోలేక..

బాయ్‌ఫ్రెండ్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఫొటోలను మార్ఫ్ చేసిన ప్రజెంట్ గర్ల్‌ఫ్రెండ్