
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకమయి నగర్ కాలనీలో దారుణం జరిగింది. కన్న తండ్రే కాల యముడిలా తన ఐదు సంవత్సరాల కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
రాజేశ్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. తాగుడుకు బానిసయ్యాడు. మద్యం మత్తులో తన కూతురు, ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు రాజేశ్. కుమార్తెపై తండ్రి దారుణానికి పాల్పడటం తట్టుకోలేని తల్లి మేఘా… నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్ కు తరలించారు.