గ్రాడ్యుయేషన్ వేడుకలో కుమారుడిని సర్ ప్రైజ్ చేసిన తండ్రి

గ్రాడ్యుయేషన్ వేడుకలో కుమారుడిని సర్ ప్రైజ్ చేసిన తండ్రి

పాఠశాలలో జరిగిన 5వ తరగతి గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరైన తన తండ్రిని చూసి కొడుకు ఆశ్చర్యపోయాడు.తండ్రిని చూసిన ఆ కుమారుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్న తర్వాత వెంటనే తండ్రి వద్దకు వచ్చి హత్తుకుని భావేద్వేగానికి లోనయ్యాడు. కొడుకు గ్రాడ్యుయేషన్ వేడుకను చూసేందుకు అతని తండ్రి వేక్రాస్ నుంచి స్టీమ్ బోట్ స్ప్రింగ్స్ కి వెళ్లాడు. తన కొడుకు వేదికపై నడుచుకుంటూ 5వ తరగతి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకోవడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.కొడుకు డకోటా గ్రాడ్యుయేషన్ వేడుకకు సంబంధించి వీడియోను చిన్నారి తల్లి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియోకు భారీగా వ్యూస్,లైక్ లు వచ్చాయి. తన కొడుకు 5వ తరగతి పట్టభద్రుడయ్యాడని..ఈ విజయాన్ని అందరం ఎంతో గర్వంగా జరుపుకుంటామని తెలిపింది తల్లి. తన కొడుకు వీడియోను చూసి అభినందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Calibornbree (@calibornbree)