ఎంఐఎంకు భయపడి ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ అంటున్నరు

ఎంఐఎంకు భయపడి ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ అంటున్నరు

యాదగిరిగుట్ట, వెలుగు :  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 17ను ఉద్యమ టైంలో ‘తెలంగాణ విమోచనం’ అన్న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు ఎంఐఎంకు భయపడి ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ అంటున్నారని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసందర్‌‌‌‌‌‌‌‌రావు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌ విమర్శించారు. శుక్రవారం యాదగిరిగుట్టలో నిర్వహించిన ఆఫీస్‌‌‌‌‌‌‌‌ బేరర్ల మీటింగ్‌‌‌‌‌‌‌‌లో వారు మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరులకు బీజేపీతోనే సరైన గౌరవం దక్కుతుందన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు భయం మొదలైందని, అందుకే హడావుడిగా ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ పేరుతో  కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ప్రజలు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ రాజకీయ సమాధి తప్పదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్, దాసరి మల్లేశం, జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి నందకుమార్‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌, ప్రధాన కార్యదర్శి రాఘవులనరేందర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

గడ్డం బాలయ్యకు సన్మానం

యాదాద్రి, వెలుగు : రజాకార్లతో పోరాడిన, యాదాద్రి జిల్లా బీబీనగర్‌‌‌‌‌‌‌‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గడ్డం బాలయ్యను శుక్రవారం బీజేపీ లీడర్లు సన్మానించారు. అంతకుముందు గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌రావు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, నాయకులు కాసం వెంకటేశ్వర్లు, నందకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, దాసరి మల్లేశం పాల్గొన్నారు.