వాటమ్మా..వాటీజ్ డేటమ్మా..!: 02-02-2020

వాటమ్మా..వాటీజ్ డేటమ్మా..!: 02-02-2020

క్యాలెండర్ తేదీలో ఒకేసారి రోజు, నెల, సంవత్సరం రావడం అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఆ రోజు ఈ రోజో కావడంతో ఇవాళ్టి తేదీతో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. 02-02-2020 తేదీని  మీరు ఎటు చూసినా ఒకటే తేదీ వస్తుంది. దీనినే పాలిండ్రోమ్ డే అంటారు. ఇలాంటి పాలిండ్రోమ్ ఎక్కువగా అక్టోబర్ నెలలో(1-10-2011, 2-10-2012, 3-10-2013, 4-10-2014, 5-10-2015, 6-10-2016, 7-10-2017, 8-10-2018, 9-10-2019) వచ్చాయి.

అయితే 2020 సంవత్సరంలో ఫిబ్రవరి 2న రావడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.  సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లు పెడుతూ ..ఏదైనా మంచి పని చేయాలనుకునేవారు ఎప్పటికీ  గుర్తుండేలా ఇవ్వాల చేద్దాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమికులతై వారు ఇష్టపడ్డవారికి ఇవ్వాలే ప్రపోజ్ చేయండి అంటూ ఛలోక్తులు వేస్తున్నారు నెటిజన్లు.