ఆఫీసులోనే మహిళా ఉద్యోగిని సూసైడ్ అటెంప్ట్.. లీడర్ల వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ

ఆఫీసులోనే మహిళా ఉద్యోగిని సూసైడ్ అటెంప్ట్.. లీడర్ల వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ

నల్లబెల్లి, వెలుగు: మహిళా ఉద్యోగిని లెటర్ రాసి ఆత్మహత్యకు యత్నించిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లిలో కలకలం రేపింది. వెంటనే ఆమెను ఆఫీసు సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. బాధితురాలి బంధువులు తెలిపిన మేరకు.. వాంకుడోతు కల్పన గత పదేండ్లుగా నల్లబెల్లి తహసీల్దార్ ఆఫీసులో జూనియర్​అసిస్టెంట్‎గా విధులు నిర్వహిస్తుంది. 

కాగా.. అదే మండలంలోని బిల్ నాయక్ తండాకు చెందిన లీడర్ మాలోతు చరణ్ సింగ్ కొంతకాలంగా ఆఫీసులో పనులు చేసి పెట్టాలని ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. అయినా లొంగకపోవడంతో చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని కవిత గతంలో తహసీల్దార్‎కు చెప్పినా పట్టించుకోలేదు. 

అంతేకాకుండా కవితపై కలెక్టర్‎కు, మీడియాలో చరణ్ సింగ్ తప్పుడు ఆరోపణలు చేస్తూ వేధిస్తున్నాడు. దీంతో సోమవారం కల్పన ఆఫీసులో లెటర్ రాసి పెట్టి, పురుగుల మందు తాగింది. సిబ్బంది వెంటనే నర్సంపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. లోకల్​లీడర్ల వేధింపులతోనే  కవిత పురుగుల మందు తాగిందని బంధువులు ఆరోపిస్తున్నారు.