అమెరికా సరిహద్దుల్లో కంచె ఏర్పాటు

అమెరికా సరిహద్దుల్లో కంచె ఏర్పాటు

అమెరికా సరిహద్దుల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ దేశ రక్షణ వ్యవహారాలను చూసుకునే పెంటగాన్ దాదాపు బిలియన్‌ డాలర్లను కేటాయించింది. ఈ నిధులతో దాదాపు 92 కిలోమీటర్ల వరకు 18అడుగల వెడల్పుతో కంచెను నిర్మించనున్నారు. దీంతోపాటు రోడ్లను నిర్మించడం, లైట్లను ఏర్పాటు చేయడం వంటివి చేస్తారు. పెంటగాన్‌ చీఫ్‌ పాట్రిక్‌ షాన్హన్‌ ఈ విషయాన్ని సోమవారం తెలిపారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ, కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ పెట్రోల్‌లకు సహకరించేలా…. అమెరికా కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ విభాగాం కమాండర్‌కు పనులు ప్రారంభించేదుకు పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అడ్డుకొనేందుకు ఈ చర్యలు సరైనవేనన్నారు డిఫెన్స్‌ సెక్రటరీ . డిపార్ట్‌మెంట్‌ డిఫెన్స్‌ అథారిటీకి రోడ్లు, కంచె, లైట్ల నిర్మాణానికి అవసరమైన అధికారం అప్పజెప్పామని తెలిపారు.