
తెలంగాణలో అతిపెద్ద పండుగలు అయిన బతుకమ్మ, దసరా సందర్భంగా ఉమ్మడి జిల్లాలో సందడి నెలకొంది. విద్యార్థులకు ఆదివారం నుంచి సెలవులు రావడంతో గురుకులాలు, హాస్టళ్ల నుంచి శనివారం సాయంత్రం ఇంటిబాట పట్టారు. పండగల సందర్భంగా గ్రామాల్లో సందడి చేసేందుకు పెట్టేబేడా సర్ధుకొని బయలుదేరారు.
దీంతో కరీంనగర్, ఇతర పట్టణాల బస్టాండ్లు మహిళలు, విద్యార్థులతో రద్దీగా మారాయి. బస్సులో సీటు కోసం జనం పరుగులు పెట్టారు. మరోవైపు మహిళలు బతుకమ్మ పేర్చేందుకు పూలు, ఇతర సామగ్రి కొంటున్నారు. కొత్త బట్టలు కొనుగోళ్లతో షాపింగ్ మాల్స్ రద్దీగా మారాయి. -వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్