
న్యూఢిల్లీ: ‘త్వరగా పెట్రోల్ ఫుల్‌ట్యాంక్ చేసుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఎన్నికల ఆఫర్’ అయిపోతుంది’ అని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇంకో రెండు రోజుల్లో ఉత్తర ప్రదేశ్ లో చివరి దశ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్ కు 100 డాలర్లు దాటినా .. పంజాబ్, యూపీ, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలను లాక్ చేశాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి.
फटाफट Petrol टैंक फुल करवा लीजिए।
— Rahul Gandhi (@RahulGandhi) March 5, 2022
मोदी सरकार का ‘चुनावी’ offer ख़त्म होने जा रहा है। pic.twitter.com/Y8oiFvCJTU
ఇవి కూడా చదవండి
రష్యాతో యుద్ధం చేసేందుకు తిరిగొచ్చిన ఉక్రెనియన్లు
డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి మార్చిలో ఎన్నికలకు వెళ్తడు