చేగువేరా బయోపిక్

చేగువేరా బయోపిక్

క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘చే’. లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. బి.ఆర్. సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘చేగువేరా బయోపిక్ తీయాలన్నది నా ఇరవై ఏళ్ల కల. 

ఆయన లైఫ్‌‌లో జ‌‌రిగిన‌‌ ఎన్నో అరుదైన విష‌‌యాలను ఇందులో చూపించాం. మూవీ పోస్టర్‌‌ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చెయ్యడం సంతో షంగా ఉంది. డిసెంబ‌‌ర్ ఫ‌‌స్ట్ వీక్‌‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు.