
‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ముంబై, థాయ్‌లాండ్‌లో కొంత భాగం షూట్ జరిగింది. తాజాగా బుధవారం నుంచి ముంబైలో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేశారు. ‘స్కంద’ కోసం కొంత బరువు పెరిగిన రామ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్‌తో రెడీ అయ్యాడు. ఈ సందర్భంగా ‘బ్యాక్ టు ముంబై’ అంటూ తన కంప్లీట్ మేకోవర్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. రామ్ ‘స్కంద’ చిత్రం ఈరోజు నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.