కస్టమర్లతో మరింత ఫ్రెండ్లీగా ఉండండి

కస్టమర్లతో మరింత ఫ్రెండ్లీగా ఉండండి
  • బ్యాంకులకు నిర్మలా సీతారామన్ సూచన

ముంబై: కస్టమర్లతో మరింత ఫ్రెండ్లీగా ఉండాలని ఫైనాన్స్​ మినిస్టర్ నిర్మలా సీతారామన్​ బ్యాంకులకు సూచించారు. దాంతో బ్యాంకుల నుంచి అప్పులను తీసుకోవడానికి బారోవర్లు ముందుకు వస్తారని అన్నారు. కానీ, ఎట్టి పరిస్థితులలోనూ అర్హతలేని వారికి అప్పులు ఇవ్వద్దని, అన్ని జాగ్రత్తగా చూసుకునే ఇవ్వమని బ్యాంకులకు చెప్పారు. అప్పులు తీసుకోండి, సెక్యూరిటీ మీరివ్వనక్కర్లేదు... నేనే  సెక్యూరిటీగా  ఉన్నానని సిటిజన్లకు ఫైనాన్స్​ మినిస్టర్​ సూచించారు. ఇండస్ట్రీ ప్రతినిధులతో జరిగిన ఒక మీటింగ్​లో నిర్మలా సీతారామన్​ మాట్లాడారు. తానే సెక్యూరిటీగా ఉన్నానంటూ ప్రైమ్​ మినిస్టర్​ ఇటీవల చెప్పిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముద్రా, స్వనిధి స్కీములను అదే ఉద్దేశంతో తెచ్చామని, ఈ స్కీముల కింద తీసుకున్న అప్పులను సక్రమంగా చెల్లింపులు చేస్తున్నారని కూడా ఫైనాన్స్​ మినిస్టర్​ వెల్లడించారు. సెల్ఫ్​హెల్ప్​ గ్రూపులు (ఎస్​హెచ్​జీ) దేశంలో సక్సెసయ్యాయని, లక్షలాది మహిళలు ఎంట్రప్రెనూర్లుగా మారారని దీపమ్​ సెక్రటరీ తుహిన్​ కాంత పాండే చెప్పారు. బ్యాంకులు, కార్పొరేట్​ కంపెనీల బాలెన్స్​ షీట్లు మెరుగుపడుతున్న సూచనలున్నాయని రెవెన్యూ సెక్రటరీ తరుణ్​ బజాజ్​ పేర్కొన్నారు. రాబోయే ఏళ్లలో మన గ్రోత్​ రేటు మెరుగ్గా ఉండాలనే అంశంపై ఫోకస్​ పెడుతున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

అమెరికా టు హైదరాబాద్‌‌ కొరియర్​లో గంజాయి

దవాఖాన్లలో డయాగ్నస్టిక్‌‌ మెషీన్ల రిపేర్​ బాధ్యత కంపెనీలదే

బంగారు భారతదేశం తయారు చేసుకుందాం