స్మగ్లింగ్ ఆపడానికి కలిసి పనిచేయండి: నిర్మలా సీతారామన్

స్మగ్లింగ్ ఆపడానికి కలిసి పనిచేయండి: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: స్మగ్లింగ్, అక్రమ వ్యాపారాలను అడ్డుకోవడానికి వివిధ ప్రభుత్వ విభాగాలు కలిసి పనిచేయాలని ఫైనాన్స్ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ పిలుపు ఇచ్చారు. ఒక విభాగం వద్ద ఉండే సమాచారాన్ని మరో విభాగం ఇచ్చి, పుచ్చుకుంటూ అక్రమ వ్యాపారాలను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  స్మగ్లింగ్​, అక్రమ వ్యాపారాల వెనక ఉండే మాస్టర్​ మైండ్స్​ను గుర్తించడంపై ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజన్సీలు ఫోకస్​ పెట్టాలని చెప్పారు. ఎకానమీ, ప్రజలను దెబ్బతీసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆయా ఏజన్సీలు  చెక్​ చెప్పాలని అన్నారు. 

స్మగ్లింగ్​ లేదా అక్రమంగా ట్రేడింగ్​సాగుతున్న వస్తువులు గత 50–60 ఏళ్లుగా మారలేదని, విలువైన మెటల్స్, నార్కోటిక్స్​, విలువైన అటవీ రిజర్వులు, జల చరాలలోనూ అలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయని నిర్మలా సీతారామన్​ సోమవారం డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ (డీఆర్​ఐ) నిర్వహించిన గ్లోబల్​ కాన్ఫరెన్స్​లో పేర్కొన్నారు. స్మగ్లింగ్​ జరుగుతున్న వస్తువులు ఏవిటనేది మనకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చిందని, అలాంటి స్మగ్లింగ్​ వెనక ఎవరున్నారనేది కూడా ప్రభుత్వ ఏజన్సీల వద్ద సమాచారం ఉండే ఉంటుందని అన్నారు.  

లోకల్​ అథారిటీస్​, గవర్నమెంట్ల సాయంతో స్మగ్లింగ్​ వెనకాల ఉండే మాస్టర్​ మైండ్స్​ను కనుక్కునే ప్రయత్నాలను డరల్డ్​ కస్టమ్స్​ ఆర్గనైజేషన్​ (డబ్ల్యూసీఓ)  సాయంతో చేయాలని ఫైనాన్స్​ మినిస్టర్​ సూచించారు. స్వాధీనం చేసుకున్న స్మగుల్డ్​ వస్తువులను తిరిగి మార్కెట్లోకి రానీయకుండా, వాటిని పాడు చేస్తే అక్రమ వ్యాపారాలు తగ్గే ఛాన్స్‌‌ ఉంటుందని పేర్కొన్నారు. స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామనే భావన పౌరులలో నమ్మకాన్ని పెంచుతుందని నిర్మలా సీతారామన్​ చెప్పారు. బంగారం, సిగరెట్లు, నార్కోటిక్స్​, యాంటిక్స్​, వైల్డ్​లైఫ్​ మెటీరియల్స్​ వంటివే స్మగుల్​ అవుతున్నాయని అన్నారు.