నిర్మాణంలోని బ్రిడ్జిని ప్రారంభించిన ఆదిత్య థాకరే.. పోలీస్ కేసు

నిర్మాణంలోని బ్రిడ్జిని ప్రారంభించిన ఆదిత్య థాకరే.. పోలీస్ కేసు

శివసేన (యూబీటీ ) నేత ఆదిత్య థాకరే ముంబైలో ఓ బ్రిడ్జీని అనధికారికంగా ప్రారంభించడంతో వివాదం నెలకొంది. ముంబై నగరంలోని లోయర్ పరేల్ లోని డిలిస్లే రోడ్ బ్రిడ్జిని ప్రారంభించి నందుకు శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత ఆదిత్య థాకరే, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు.డిలిస్లే రోడ్ బ్రిడ్జీ పూర్తిగా నిర్మాణం జరగలేదు..వంతెన తెరవడానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి లేదు. బీఎంసీ అధికారులు ఫిర్యాదుతో పోలీసులు ఆదిత్య థాకరే పాటు ఇతర పార్టీ నేతలపై కేసు నమోదు చేశారు.

డెలిస్లే రోడ్ బ్రిడ్జీ పశ్చిమాన లోయర్ పరేల్, వర్లి, ప్రభావేది, కర్రీ రోడ్లు, తూర్పున ఉన్న బైకుల్లా, ఇతర ప్రాంతాల మధ్య కీలకమైన లింక్. బ్రిడ్జీ కూలిపోయే దశలో ఉందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి ప్రకటించిన తర్వాత దీనిని 2018లో దీనిని మూసివేశారు. 
అయితే బ్రిడ్జీ ఓపెనింగ్ కుసిద్ధంగా ఉంది.. ప్రభుత్వం, బీఎంసీ బ్రిడ్జీ ఓపెనింగ్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు.. అందుకే  మేం ప్రజలకోసం మేం దానిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించాం.. అని శివసేన (యూబీటీ ) నేత ఆదిత్య థాకరే ట్వీట్ చేశారు. పదిరోజులుగా మేం వేచి వున్నాం.. జనం బాధపడుతున్నారు. రెండో వైపు బ్రిడ్జీ కూడా సిద్దమైంది. ప్రారంభోత్సవానికి వీఐపీ కోసం ఎదురు  చూస్తున్నారు. నిన్న రాత్రి మేం బ్రిడ్జీని ప్రారంభించాం.. మహారాష్ట్ర సర్కార్ దానిని బీఎంసీ చేత బలవంతంగా మూసివేయించిందన ఆదిత్య థాకరే ఆరోపించారు.