
కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) సోషల్ మీడియాలో ఏదో విషయంపై..ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది. రీసెంట్ గా (అక్టోబర్ 28న) హీరో దర్శన్ కు చెందిన మూడు పెంపుడు కుక్కలు ఓ మహిళపై దాడి చేశాయి. దీంతో రెండో నిందితుడిగా దర్శన్ పై (సెక్షన్ 289 ఐపిసి) (జంతువుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించడం) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడించాయి.
వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గత నెల అక్టోబర్ 28న బెంగళూరులోని ఆర్ఆర్ నగర్‌లోని స్పర్శ్ హాస్పిటల్ లో ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళా డాక్టర్ వచ్చింది. ఆ మహిళా డాక్టర్ తన కారును దర్శన్ కు చెందిన ఖాళీ స్థలంలో పార్క్ చేసిందని తెలిపారు.
తిరిగి ఆ డాక్టర్ కార్యక్రమం ముగుంచుకుని వచ్చేసరికి తన వాహనం దగ్గర మూడు కుక్కలు కనిపించాయి. ఆ కుక్కలను తరలించాలని దర్శన్ ఇంటి సమీపంలోని సిబ్బందిని..డాక్టర్ కోరినట్లు చెప్పారు. కానీ, అక్కడున్న వారు కుక్కలను పంపించకపోవడంతో పాటు..ఇక్కడ ఎలా పార్క్ చేస్తారంటూ గొడవకు దిగగా..అక్కడున్నకుక్కలు డాక్టర్ పై దాడి చేశాయని పోలీసులు తెలిపారు.
ఈ కుక్కల దాడిలో డాక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయని..వెంటనే కంప్లెయింట్ ఇచ్చినట్లు పోలీసులు వివరించారు. ఇదే విషయంపై హీరో దర్శన్ ఇంకా స్పందించలేదని సమాచారం.
హీరో దర్శన్ 2001లో మెజెస్టిక్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. అతని కెరీర్‌లో 50కి పైగా చిత్రాలలో నటించి కన్నడలో ఫేమస్ యాక్టర్ గా గుర్తింపు పొందారు. కొన్నేళ్ల క్రితం..హీరో దర్శన్ ఆడియో క్లిప్ ఒకటి వైరల్ అవ్వగా..అతనిపై 2 సంవత్సరాల నిషేధం విధించిన విషయం తెలిసిందే.
Also Read :-స్టార్ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదు..ఎందుకంటే?