బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్వేత వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం

బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్వేత వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం

బిగ్ బాస్ సీజన్ 5(Bigg boss season5) కంటెస్టెంట్ శ్వేత వర్మ(Shwetha varma) ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక గది పూర్తిగా కాలిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా శ్వేత తన సోషల్ మీడియా వేదిక వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని, తనతోపాటు..  కుటుంబ సభ్యులు, తన పెట్స్ కూడా బాగానే ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swetaa Varma (@swetaavarma)

మా ఇంట్లో భయంకరమైన అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఒక గది పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాస్తూ ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. మా కుటుంబ సభ్యులు, పెట్స్ సేఫ్ గా ఉన్నాము కానీ.. ఈ షాక్ నుండి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. త్వరలో సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.. అని రాసుకొచ్చారు శ్వేత.