
హైదరాబాద్ మూసాపేట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూసాపేట్ లోని భరత్ నగర్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సోమవారం ( ఆగస్టు 25 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మూసాపేట్ భరత్ నగర్ ఫ్లైఓవర్ పక్కన భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న ఆటో దగ్దమయ్యింది.
ఘటన జరిగిన సమయంలో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అక్కడే ఉన్న ఆటో పూర్తిగా దగ్దమైనట్లు తెలుస్తోంది.