
సంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సులో మంటలు రావటం కలకలం సృష్టించింది. విద్యార్థులను ఎక్కించుకుంటున్న సమయంలో బస్సులో మంటలు చెలరేగటంతో ఆందోళనకు గురయ్యారు విద్యార్థులు, టీచర్లు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పిల్లలను బస్సులోనుంచి బయటకు దించారు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది.
కిష్టారెడ్డిపేటలో విద్యార్థులను ఎక్కించుకుంటుండగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విద్యార్థులు బస్సులోనే ఉండటం ఆందోళన కలిగించింది. పిల్లలను ఎక్కించుకునే క్రమంలో కింద స్పార్క్ వచ్చి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ హుటాహుటిన బస్సులో నుంచి పిల్లలను కిందకు దించేశాడు
ALSO READ : బ్రెజిల్‌పై డొనాల్డ్ ట్రంప్ 50% సుంకం.. ఆగస్టు 1 నుంచి అమలులోకి..
మంటలు మెల్ల మెల్లగా వ్యాపించడంతో బస్సు పాక్షికంగా దగ్ధమయినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.