జిన్నింగ్‌‌ మిల్లులో అగ్నిప్రమాదం..రూ. కోటి విలువైన పత్తి దగ్ధం

జిన్నింగ్‌‌ మిల్లులో అగ్నిప్రమాదం..రూ. కోటి విలువైన పత్తి దగ్ధం

మల్హర్ (కాటారం), వెలుగు : జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలోని మీనాక్షి జిన్నింగ్‌‌ మిల్లులో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మిల్లులో ఉన్న రెండు వేల క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. పొగ కప్పేయడంతో మరికొంత పత్తి పనికి రాకుండాపోయింది.

మంటలను గుర్తించిన జిన్నింగ్‌‌ మిల్‌‌ యాజమాన్యం కాటారం పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్‌‌ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో రూ.కోటి పైగా నష్టం జరిగినట్లు మిల్లు యజమానులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.