
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నిడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పీహెచ్‌సీలోని మెడిసిన్, పాత రికార్డులు, పాత ఐఆర్ మిషన్ కాలిపోయింది. భవనంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి. విషయం తెలుసుకున్న స్టాఫ్ వెంటనే అగ్నిమాపక, విద్యుత్, పోలీస్ అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే ఫైర్‌సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. ప్రమాదంలో పీహెచ్సీ స్టోర్ రూమ్ లో ఉన్న పలు రకాల సిరప్ లు, పాత రికార్డులు, పాత ఐఆర్ మిషన్, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయి. ఆదివారం ఘటనాస్థలాన్ని మిర్యాలగూడ డిప్యూటీ డీఎంహెచ్ వో రవి పరిశీలించారు.