ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని జిల్లా కోర్ట్ ఎదురుగా నిలిపిన స్విఫ్ట్ డిజైర్ కారు లో సాంకేతిక లోపంతో ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ట్రాఫిక్,సివిల్ పోలీసులు ఫైర్ ఇంజన్ సిబ్బందితో కలిసి మంటలు ఆర్పారు. దగ్ధమైన కారు శ్రీసాయి అంజన చిట్ ఫండ్ కంపెనీకి చెందిందని, నరేశ్ అనే వ్యక్తి షాపింగ్ కోసం వచ్చి పార్కు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిలిపిన కారులో ఒక్కసారిగా ఇంజన్ లో మంటలు చెలరేగడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణహాని ఏమి జరగలేదు. కారు దగ్దమైన విషయం లో ఎలాంటి ఫిర్యాదు అందలేదని టూ టౌన్ పోలీసులు తెలిపారు.