మణిపూర్లో కాల్పులు..జవాన్ మృతి..ముగ్గురికి గాయాలు

మణిపూర్లో కాల్పులు..జవాన్ మృతి..ముగ్గురికి గాయాలు

మణిపూర్ లో మళ్లీ ఉగ్రవాదుల అనుమానిస్తున్న సాయుధ దుండగులు రెచ్చిపోయారు. సెంట్రల్ రిజర్వ్ ఫోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలపై కాల్పు జరపడంతో ఒక జవాను మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. జిరిబామ్ జిల్లా మాంగ్ బుగ్ , సెయిజాంగ్ గ్రామాల్లో సాయుధదుండగులకు, సీఆర్ పీఎఫ్ బలగాలకు మధ్య ఆదివారం(జూలై14, 2024) ఉదయం కాల్పులు జరిగాయి. 

ఈ కాల్పుల్లో బీహార్ కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ అజయ్ కుమార్ మృతిచెందారు. మరో జవాన్ కు , ఇద్దరు మణిపూర్ కమాండోలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రస్తుతం జిరిబామ్ ఆస్పత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. 

మరోవైపు మణిపూర్ సీఎం బైరేన్ సింగ్.. దుండగులు దాడిని తీవ్రంగా ఖండించారు. సాయుధ దుండగుల దాడి తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతి చెందిన వీర జవాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో చేశారు. దాడి చేసిన దుండగులు కుకి వర్గానికి చెందినవారని అనుమానిస్తున్నామని అన్నారు.