మొదటి కార్బన్​ న్యూట్రల్​ పంచాయతీ

మొదటి కార్బన్​ న్యూట్రల్​ పంచాయతీ

జమ్మూలోని సాంబ జిల్లాలో ఉన్న పల్లి అనే గ్రామ పంచాయతీ దేశంలోనే మొదటి కార్బన్​ న్యూట్రల్​ పంచాయతీగా నిలిచింది. ఈ గ్రామం మొత్తం సౌరశక్తి ఆధారిత గ్రామం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2022 ఏప్రిల్​ 24న ఈ గ్రామంలో 500 కిలోవాట్ల సోలార్​ ప్లాంట్​ను ప్రారంభించారు. కేవలం మూడు వారాల కాలపరిమితితో ఈ ప్లాంటు రూపుదిద్దుకుంది. మొత్తం 6408 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1500 సోలార్​ ప్యానెల్స్​ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పంచాయతీలోని 340 ఇళ్లకు విద్యుత్​ను అందిస్తున్నారు. కార్బన్​ న్యూట్రాలిటీ అంటే సున్నా కార్బన్​ డై ఆక్సైడ్​ ఉద్గారాలను సాధించడాన్ని సూచిస్తుంది. కార్బన్​ డయాక్సైడ్​ ఉద్గారాల తొలగింపును సమతుల్యం చేయడం ద్వారా కార్బన్​ న్యూట్రల్​ అనే పదాన్ని శక్తి ఉత్పత్తి, రవాణా, పరిశ్రమలు, వ్యవసాయం విషయంలో ఉపయోగిస్తారు.