Good News : గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ నుంచి రక్షించుకోవటానికి కొత్త మందు వచ్చేసింది.

Good News : గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ నుంచి రక్షించుకోవటానికి కొత్త మందు వచ్చేసింది.

గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి గుడ్ న్యూస్. టైప్ 2 డయాబెటిస్ రోగులు గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ నుంచి రక్షించుకోవటానికి కొత్త మందు మార్కెట్లోకి వచ్చేసింది. ఈ మేరకు గుండెపోటు, స్ట్రోక్‌ను నివారించడంలో సహయపడే నోటి ద్వారా వేసుకునే మొదటి GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ రైబెల్సస్ (సెమాగ్లుటైడ్) టాబ్లెట్‎ను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)ఆమోదించింది.

రక్తంలో చక్కెర నిర్వహణ కోసం 2019లో రైబెల్సస్ మొదటిసారిగా ఎఫ్డీఏ ఆమోదం పొందింది. ఇటీవల జరిగిన పరిశోధనల్లో రైబెల్సస్ ఔషధం గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గుండె పోటు, హార్ట్ స్ట్రోక్‎ తదితర ప్రతికూల హృదయ సంబంధ సమస్యలను తగ్గించడానికి ఈ ఔషధాన్ని సూచించవచ్చని ఎఫ్డీఏ వెల్లడించింది. 

న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన సోల్ ట్రయల్ కథనం ప్రకారం.. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు టైప్ 2 డయాబెటిస్, అధిక గుండె సంబంధిత ప్రమాదం ఉన్న 9,650 మందిపై పరిశోధనలు చేశారు. ఈ ట్రయల్‎ల్లో పాల్గొన్నవారికి షుగర్, గుండె సంబంధిత మెడిసిన్‎తో పాటు నోటి ద్వారా తీసుకునే రైబెల్సస్ సెమాగ్లుటైడ్ ఇచ్చారు. ఫలితాల్లో నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ వల్ల ప్రమాద తీవ్రత 14 శాతం తగ్గినట్లు గుర్తించారు పరిశోధకులు. 

గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడటానికి నోటి ద్వారా తీసుకునే GLP-1 ట్రీట్మెంట్ ఒక ఆవిష్కరణ అని నార్త్ కరోలినా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో మెడిసిన్ ప్రొఫెసర్, సోల్ స్టీరింగ్ కమిటీ సహ-చైర్ డాక్టర్ జాన్ బి. బ్యూస్ అన్నారు. ఈ గుండె పోటు, హార్ట్ స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడంలో సెమాగ్లుటైడ్ కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.