రవీంద్ర విజయ్ ‘డోంట్ స్లీప్’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ 

రవీంద్ర విజయ్ ‘డోంట్ స్లీప్’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ 

వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును అందుకున్నాడు రవీంద్ర విజయ్. ఆదివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తను కీలక పాత్ర పోషిస్తున్న  ‘డోంట్ స్లీప్’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ బర్త్‌‌‌‌‌‌‌‌డే విషెస్ తెలియజేసింది టీమ్. ఇందులో  రవీంద్ర విజయ్ స్టైలిష్ లుక్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకున్నాడు.  ఇంటెన్స్ వైబ్‌‌‌‌‌‌‌‌తో ఉన్న ఈ పోస్టర్  ఆయన పాత్రలో వున్న సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌ను  ప్రజెంట్ చేస్తోంది.  

 ‘చౌర్య పాఠం’తో  ఆకట్టుకున్న ఇంద్ర రామ్ ఈ చిత్రంలో  హీరోగా నటిస్తున్నాడు.   సినిమాటోగ్రాఫర్ షామ్‌‌‌‌‌‌‌‌దత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వి డ్రీమ్స్ ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  వి చూడామణి నిర్మిస్తున్నారు.   ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుందని మేకర్స్ చెప్పారు.  తబా రీమా, జ్యోతి బెనర్జీ, సునీల్ థాపా, ఆడుకలం నరేన్, కల్పలత, అనీష్ కురువిల్లా, వెన్నెల కిషోర్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి  గోకుల్ హర్షన్ సంగీతం  అందిస్తున్నాడు.