ఘంటసాల నాగ విశ్వనాథ్ దర్శకత్వంలో స్ప్లాష్ కలర్ మీడియా ఎంటర్టైన్మెంట్, శ్రీ లక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్, జశ్రీత ప్రొడక్షన్స్, రితికా ఫిలిమ్స్ బ్యానర్లపై సాయి కుమార్ మెడి, జయ వేణుబాబు నిర్మిస్తున్న చిత్రం ‘వేగ లీల’. ఆదివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్‌లో కనిపిస్తున్న డిజైన్, కలర్ టోన్, టైటిల్ స్టైలింగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘మా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ఆనందంగా ఉంది. ఆగస్టులో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. పవన్ చరణ్ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దిలీప్ కుమార్ చిన్నయ్య సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. కథ, నటీనటులు, టీజర్, ట్రైలర్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ చేస్తాం’ అని అన్నారు.
