హోవ్: టీ20 సిరీస్ ఓటమికి ఇండియా విమెన్స్ టీమ్ తొందరగానే ప్రతీకారం తీర్చుకుంది. టార్గెట్ ఛేజింగ్‌లో స్మృతి మంధాన (99 బాల్స్‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 91), యస్తికా భాటియా (50), హర్మన్‌ప్రీత్ కౌర్ (74 నాటౌట్) రాణించడంతో.. ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 227/7 స్కోరు చేసింది. డేవిడ్సన్ (50 నాటౌట్) టాప్ స్కోరర్. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 44.2 ఓవర్లలో 232/3 స్కోరు చేసి గెలిచింది. షెఫాలీ (1) ఫెయిలైనా మంధాన.. భాటియాతో రెండో వికెట్‌కు 96, కౌర్‌తో మూడో వికెట్‌కు 99 రన్స్ జోడించింది. రెండో వన్డే బుధవారం జరుగుతుంది.
