
- నేడు ప్రొటెం స్పీకర్ నియామకం
- 9న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం!
- ఆదివారం లేదా సోమవారం స్పీకర్ ఎన్నిక
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సెషన్శనివారం ప్రారంభం కానుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈ సెషన్ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఈ మేరకు సీనియర్ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ నియమించనున్నారు.
తర్వాత ప్రొటెం స్పీకర్‌తో గవర్నర్రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన అధ్యక్ష స్థానంలో ఉండి మిగతా 118 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో అందరికన్నా సీనియర్‌గా మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు. ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏడేసి సార్లు గెలిచారు.
అక్బరుద్దీన్ఒవైసీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, దానం నాగేందర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అసెంబ్లీలో కేసీఆర్ సీనియర్ అయినా.. ఆయన ప్రొటెం స్పీకర్‌గా ఉండేందుకు అంగీకరించే అవకాశం లేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత సీనియర్లు అయిన హరీశ్, పోచారంలలో ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ ఎంపిక చేసే అవకాశముంది.
మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు గెలిచిన జూపల్లి, ఉత్తమ్, తుమ్మల మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. దీంతో వారు ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం లేదు. అక్బరుద్దీన్ఎంఐఎం సభ్యుడు కాగా.. తలసాని, దానం ఇద్దరు బీఆర్ఎస్ఎమ్మెల్యేలే. వీరిలోనూ ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే అవకాశముందని తెలుస్తున్నది.
అయితే ఎవరిని ప్రొటెం స్పీకర్‌గా నియమించినా ఆ బాధ్యతలు నిర్వర్తించేందుకు వారి ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలిచిన సీనియర్సభ్యుల్లోనే ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే అవకాశం కూడా ఉందని సమాచారం. తెలంగాణ మొదటి అసెంబ్లీకి సీనియర్ సభ్యుడు కుందూరు జానారెడ్డి, రెండో అసెంబ్లీకి ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను ప్రొటెం స్పీకర్లుగా వ్యవహరించారు.
స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ స్పీకర్ఎన్నిక కోసం నోటిఫికేషన్జారీ చేస్తారు. ఆదివారం లేదా సోమవారం స్పీకర్ఎన్నికను నిర్వహిస్తారు. స్పీకర్‌గా వికారాబాద్ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను కాంగ్రెస్ హైకమాండ్ఇప్పటికే ప్రకటించింది. ఆయన ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
స్పీకర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాసేపు సభను నడిపిస్తారు. మరుసటి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడుతారు. ఈ సెషన్ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.