లోక్ సభ ఎన్నికల ఫస్ట్ ఓట్ పడింది

లోక్ సభ ఎన్నికల ఫస్ట్ ఓట్ పడింది

2019 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన తొలి ఓటు అరుణా చల్ ప్రదేశ్ లో పడింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) సర్వీస్ ఉద్యోగులు ఏప్రిల్ 5, శుక్రవారం రోజున ఓట్లు వేశారు. ఉద్యోగులు ఒకరి తర్వాత ఒకరు.. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ITBP సర్వీస్ ఉద్యోగులు అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ పూర్ లో ఓటు వేశారు.

దేశమంతటా ఏడు దశల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 11న ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో పాల్గొని.. విధులు నిర్వహించే సర్వీస్ ఉద్యోగులు, భద్రతాసిబ్బంది ముందుగానే బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు వేస్తారు. అన్నిరాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.