నేషనల్ హైవేపై చేపల లోడ్ లారీ బోల్తా

నేషనల్ హైవేపై చేపల లోడ్ లారీ బోల్తా

 నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం పత్తిమిల్లు సమీపంలో  ఖమ్మం వరంగల్ నేషనల్ హైవే పై చేపల లారీ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఏపీలోని గుడివాడ నుంచి అలహాబాద్ కు ఈ లారీ వెళ్తోంది.

లారీ  డ్రైవర్, క్లినర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగ చేపల లారీ బోల్తా పడిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాలు,తండాల వచ్చి జనం వచ్చారు.  పోలీసులు వచ్చి, వారిని అడ్డుకున్నారు.