హెల్త్ యాప్స్ అన్నీ ఒకే దగ్గర

హెల్త్ యాప్స్ అన్నీ ఒకే దగ్గర

హెల్త్, ఫిట్‌‌నెస్‌‌పై ఫోకస్ పెట్టేవాళ్లు రకరకాల ఫిట్‌‌నెస్ యాప్స్ వాడుతుంటారు. ఒక్కో యాప్‌‌లో ఒక్కోరకంగా ప్రత్యేకమైన ఫీచర్లుంటాయి. అయితే గూగుల్ తీసుకొస్తున్న ‘హెల్త్ కనెక్ట్’ యాప్ ద్వారా అన్ని హెల్త్ యాప్స్‌‌ను ఒకేచోట యాక్సెస్ చేయొచ్చు.

ఫిట్‌‌నెస్ కోరుకునేవాళ్లు రకరకాల యాప్స్‌‌ ద్వారా యాక్టివిటీస్‌‌ను ట్రాక్ చేస్తుంటారు. డైట్ టిప్స్ లాంటివి ఫాలో అవుతుంటారు. అయితే అన్నిరకాల ఫిట్‌‌నెస్ టిప్స్‌‌ను  ఒకే యాప్‌‌లో  పొందేందుకు  వీలుగా గూగుల్‌‌ కొత్త యాప్ డెవలప్ చేసింది. దీనిద్వారా రకరకాల  ఫిట్‌‌నెస్, హెల్త్‌‌, వెల్‌‌బీయింగ్‌‌ యాప్‌‌లను  ఒకేచోట కనెక్ట్ చేసుకోవచ్చు.  స్మార్ట్ వాచ్, మొబైల్, ట్యాబ్లెట్.. ఇలా రకరకాల ఆండ్రాయిడ్‌‌ డివైజెస్, ఆండ్రాయిడ్ యాప్స్‌‌లో రికార్డ్ అయిన ఫిట్‌‌నెస్ డేటాను ఈ యాప్ ద్వారా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం  మైఫిట్‌‌నెస్‌‌పాల్‌‌, ఆరా, పెలోటాన్‌‌, శాంసంగ్ హెల్త్‌‌, ఫిట్‌‌బిట్‌‌ వంటి పదికి పైగా హెల్త్, ఫిట్‌‌నెస్, వెల్‌‌బీయింగ్‌‌ యాప్‌‌లు గూగుల్ హెల్త్ కనెక్ట్ ప్లాట్‌‌ఫాంతో లింక్ అయ్యాయి. త్వరలో మరిన్ని హెల్త్ యాప్స్‌‌ను లింక్ చేస్తామని గూగూల్ చెప్తోంది.  గూగుల్‌‌ హెల్త్‌‌ కనెక్ట్‌‌ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.