ఒమిక్రాన్ బాధిత డాక్టర్ ను కలిసినవారిలో ఐదుగురికి పాజిటివ్

ఒమిక్రాన్ బాధిత డాక్టర్ ను కలిసినవారిలో ఐదుగురికి పాజిటివ్

భారత్ లో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో ఇద్దరు వ్యక్తుల్లో ఈ కొత్త వేరియంట్ బయటపడగా.. వారి ప్రైమరీ, సెంకండరీ కాంటాక్టులను గుర్తించిన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఒమిక్రాన్ సోకిన 46 ఏళ్ల వ్యక్తి ఓ డాక్టర్ అని.. ఆయనతో కాంటాక్ట్ అయిన వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా తేలిందని కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ తెలిపారు. డాక్టర్ సహా వారందరినీ ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ లో ఉంచామన్నారు. వారిలో ఎవరికీ ప్రమాదకర పరిస్థితి లేదని..అందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారేనని మంత్రి తెలిపారు.

మరొకరు ..  66 ఏళ్ల వయసున్న వ్యక్తి. అతను దక్షిణాఫ్రికా  నుంచి దుబాయి మీదుగా నవంబర్ 20న కోవిడ్ నెగెటివ్ రిపోర్టుతో బెంగళూరు విమానాశ్రయానికి వచ్చినట్లు తెలిపారు మంత్రి డాక్టర్ సుధాకర్.