బీహార్ CM అవిశ్వాస తీర్మాణానికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా

బీహార్ CM అవిశ్వాస తీర్మాణానికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా

బీహార్​లో అధికారంలో ఉన్న  ఎన్డీఏ కూటమి ఈరోజు (ఫిబ్రవరి12)  బలపరీక్ష కొనసాగుతుంది. ఈనేపథ్యంలో అసెంబ్లీలో ఉత్కంఠ​ వాతావరణం నెలకొంది. బడ్జెట్ సమావేశాలు కూడా ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి. బీహార్ స్పీకర్, ఆర్జేడీ అధినేత అవధ్​ చౌధరీని తొలగించాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీ మార్క్‌ 122. అవిశ్వాస తీర్మాణంలో 127 ఓట్లు వస్తాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ అధికార కూటమికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం కలకలం రేపుతోంది. 

ఇప్పుడు ఫోకస్ అంతా నితీష్ కుమార్ కు మద్దతు ప్రకటించే హిందూస్థానీ అవామీ మోర్చా జితన్ రామ్ మాంఝీపైనే పడింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార కూటమికి మద్దతు ప్రకటిస్తే నీతీశ్ జేడీయూ సర్కార్ బల పరీక్ష నెగ్గి అధికారంలో ఉంటుంది.

Also Read : పాపాల భైరవుడు కేసీఆర్.. సభకొచ్చి మాట్లాడాలి