లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్‌లో ఐదుగురు మృతి

V6 Velugu Posted on Aug 06, 2021

పుల్కల్: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పుల్కల్ మండలం, చౌటకూర్ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు (AP 28 CL 8962) ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును చేస్తున్నారు. 

Tagged road accident, Sangareddy, car accident, Lorry, Boy died, five died, Pulkal

Latest Videos

Subscribe Now

More News